సంక్రాంతి వేడుకల్లో నగర ప్రజలకు మేయర్ సూచనలు

SMTV Desk 2019-01-12 17:32:40  Hyderabad, GHMC Mayer Bontu ram mohan, Chandanagar PJR Stadium, Sankranthi festival celebrations

హైదరాబాద్, జనవరి 12: నగరంలోని శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ ఆద్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానగరాన్ని స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని నగర ప్రజలను కోరారు.

అంతేకాక నగరంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయయని అన్ని ప్రాంతాల్లోని సంస్కృతులను కలిపి హైదరాబాద్ లో ఈ పండగను జరుపుకుంటారని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాడానికి సామరస్యంతో కూడిన ఇలాంటి పండగలను ఘనంగా నిర్వహించడానికి జీహెచ్ఎంసీ కృషి చేస్తోందని అందుకు ప్రజల నుండి కూడా సహకారం లభిస్తోందని బొంతు రామ్మోహన్ వెల్లడించారు.