బాయ్స్ హాస్టల్ లో ఈటల ఆకస్మిక తనిఖీలు...

SMTV Desk 2019-01-12 15:39:21  Etela rajender, Karimnagar, Jammikunta social welfare boys hostel

కరీంనగర్, జనవరి 12: తెరాస ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జమ్మికుంటలోని బీసీ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ హాస్టల్ వార్డన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీ కొడుకు, కూతురు అయితే ఇలాంటి వసతి గృహల్లోనే ఉంచి,ఇలాంటి భోజనమే పెడుతావా అని హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డ ఈటల. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ లో ఉన్న విద్యార్థులను వేరే బిల్డింగ్ లకు తరలించాలని తహసీల్దార్ కి ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం సంభందించిన నిధులతో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేస్తాం. మిషన్ భగీరథ పనులను వేగవంతం చెయ్యడం తో పాటు కలుషిత నిరు పైపు లైన్ల ద్వారా గృహల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.