వైసీపీకి టీడీపీ ఎమ్మెల్సీ సవాల్...

SMTV Desk 2019-01-12 15:26:34  TDP, MLA, Budda venkanna, YSRCP, YS Jagan mohan reddy

అమరావతి, జనవరి 12: శనివారం ఉదయం ఏపీ రాజధాని అమరావతిలో మీడియాతో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంగ జపం చేసినా కూడా వైసీపీ అధినేత జగన్ సీఎం కాలేడని విమర్శించారు. అంతేకాకుండా ఇరుపార్టీల మేనిఫెస్టోలపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ చేశారు.

జగన్ కుర్చీలపై కలలు కనడం తప్ప రాష్ట్ర ప్రజలకు జగన్ చేసిందేమీ లేదు అని విమర్శించారు. పెన్షన్ పెంపును వైసీపీ రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అవినీతి కేసులో జైలుకెళ్లిన జగన్‌ కి చంద్రబాబు ని విమర్శించే అర్హత లేదన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు. ఈ ఎన్నికల అనంతరం జగన్‌ కాషాయ వస్త్రాలు వేసుకుని కాశీయాత్ర చేయడం ఖాయమని అన్నారు. ముక్కుమూసుకుని కొంగజపం చేసినా జగన్ సీఎం కాలేడని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.