బొత్స కారు ఢీకొని విద్యార్థి మృతి...

SMTV Desk 2019-01-11 18:47:15  Botsa Jhansi, Former MP, Vijayawada, Car accident botsa jhansi, Car hits student

విజయనగరం, జనవరి 11: రెండు రోజుల క్రితం నగర మాజీ ఎంపీ బొత్స ఝాన్సి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ చిన్నారి ఆసుపత్రి పాలయ్యాడు. గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఆ చిన్నారిని ఈ రోజు మృతి చెందాడు. పూర్తి వివరాల ప్రకారం క్రితం బుధవారం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ప్రయాణిస్తున్న వాహనం జాతీయ రహదారిపై వెళ్తుండగా తామరపల్లికి చెందిన ఎ రోహిత్ అనే విద్యార్థి స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటే ప్రయత్నం చేయగా వేగంగా వస్తున్న బొత్స ఝాన్సీ వాహనం ఢీ కొట్టింది.

తీవ్రంగా గాయపడిన రోహిత్ శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు. ఈ వార్త తెలిసి తామరావల్లి గ్రామస్థులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన జాతీయ రహదారిని దిగ్బందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్థులను సముదాయించినా వినిపించుకోకుండా ధర్నాను కొనసాగించారు. ఈ రోడ్డుపై జరిగే ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే వరకు ధర్నా కొనసాగిస్తామని గ్రామస్థులు వెల్లడించారు.