ఉలిక్కిపడిన జడేజా అభిమాని

SMTV Desk 2019-01-11 18:06:24  Ravindra jadeja, Instagram, All-Rounder, Fans

జనవరి 11: భారత అల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో హేర్ స్టైల్ బాగుందా , ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వండి అని అభిమానులను కోరాడు. దానికి విపిన్‌ తివారి అనే యూజర్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌లో టైమ్‌ వేస్ట్‌ చేసే బదులు కాస్త ఆటపై దృష్టి పెట్టు అని ట్రోల్‌ చేసాడు. జడేజా దీనికి స్పందిస్తూ, కోపంతో మీ ఇంట్లో టీవీ లేదా ఇడియట్, సిడ్నీ టెస్టు మ్యాచ్‌ చూడలేదా అంటూ జవాబు ఇచ్చాడు. కాగా, జడేజాకు అభిమానులు అండగా నిలిచారు. ‘జడ్డూ భాయ్‌, అలాంటి ఇడియట్‌ కామెంట్స్‌ పట్టించుకోవద్దు. నీ ఆట గురించి తెలియని వారికి రిప్లై ఇవ్వాల్సిన పనిలేదు అని చెప్పారు.

జడేజా రెస్పాన్స్ తో ఉలిక్కిపడిన తివారీ మాట మార్చాడు. ‘రిప్లై ఇచ్చినందుకు థాంక్స్‌. నా కామెంట్‌కు స్పందిస్తారో లేదోనని అలా చేశా. జస్ట్‌ ఫర్‌ ఫన్. నువ్వు ఇండియన్‌ టీమ్‌లో గొప్ప ఆల్‌రౌండర్‌వి‌. మన టీమ్‌కు చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టులలో జడేజా 7 వికెట్స్ తీయగా, చివరి టెస్ట్ లో 81 పరుగులుతో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో బౌలర్‌గా 5 స్థానంలో, ఆల్‌రౌండర్‌గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.