కల్యాణ్ రామ్ సినిమాకి రిలీజ్ డేట్ ఖరారు..

SMTV Desk 2019-01-11 18:00:04  kalyan ram, new movie, 118, 118 release date

హైదరాబాద్, జనవరి 11: నందమూరి కల్యాణ్ రామ్ కి ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. దీంతో కళ్యాణ్ రామ్ ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు. తాను ఆశిస్తోన్న హిట్ 118 సినిమాతో దొరుకుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. కల్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు గుహన్ 118 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈచిత్రం చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.ఈ సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండే కళ్యాణ్ రామ్ కి జోడిగా నటిస్తోన్నారు. ఇక ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ ఆశిస్తున్నట్టుగా ఈ సినిమా అయినా ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.