విలన్ రోల్ చేయనన్న హీరో ...!!

SMTV Desk 2019-01-11 17:45:42  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani, Vivek oberoi

హైదరాబాద్, జనవరి 11: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా వివేక్ వొబెరాయ్ నటించారు. ప్రస్తుతం విలన్ పాత్రలతో బాలీవుడ్ లో వివేక్ వొబెరాయ్ బిజీగా వున్నారు. వినయ విధేయ రామ లో విలన్ పాత్రను వివేక్ వొబెరాయ్ చేస్తేనే బాగుంటుందని భావించిన బోయపాటి, ముందుగా ఆయనని సంప్రదించినప్పుడు ఆయన చేయను అని చెప్పారట.

అయితే, బోయపాటి ఈ చిత్రంలో విలన్ పాత్ర ఎలా ఉంటుందనేది ఆయనకి పూర్తిగా వివరించాడట. దాంతో విలన్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది ఆయనకి అర్థం కాగానే చేయడానికి అంగీకరించారట. ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తే మీరు చేయవలసిందేనని బోయపాటి పట్టుబట్టడం కూడా వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణమైందని అంటున్నారు.