ఏఎన్నార్ బయోపిక్ పై మనసు మార్చుకున్న నాగ్..

SMTV Desk 2019-01-11 17:26:39  Nagarjuna, ANR Biopic, NTR biopic, Sumanth

హైదరాబాద్, జనవరి 11: ఇటీవల కాలంలో తెలుగు, హిందీ భాషల్లో బయోపిక్ ల హవా జోరుగా సాగుతుంది. తెలుగులో మహానటి గా సావిత్రి బయోపిక్ తెరకెక్కిన తరవాత ఎన్టీఆర్ బయోపిక్ తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఏఎన్నార్ బయోపిక్ కి సంబంధించిన ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అప్పట్లో ఏఎన్నార్ బయోపిక్ గురించిన ప్రశ్నలు నాగార్జునకి ఎదురయ్యాయి. అక్కినేని జీవితం చాలా సాఫీగా సాగిపోయిందనీ, అందువలన ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తే డ్రామా లేదంటూ ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు.

కాగా,ఎన్టీఆర్ బయోపిక్ చూశాక, అందులో ఏఎన్నార్ గా సుమంత్ ని చూసి నాగార్జున మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. సినిమా తీశాక లాభనష్టాల సంగతి అటుంచితే, తరువాత తరాలవారికి ఏఎన్నార్ గురించిన జీవిత విశేషాలను అందిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. ఈ విషయమై నాగార్జున కుటుంబ సభ్యులంతా కూర్చుని వొక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ప్రశంసలు అందుకోవడంతో, బయోపిక్ అంటూ తీస్తే సుమంత్ తోనే తీయవచ్చనే టాక్ వినిపిస్తోంది.