మోడీకి జగన్ అమ్ముడుపోయారు...!!!

SMTV Desk 2019-01-11 16:19:33  YSRCP, BJP, TDP, YS Jagan mohan reddy, Narendramodi, Chandrababu, KE Krishnamurty, Deputy CM

కర్నూల్, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి శుక్రవారం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ధ్వజమెత్తారు. ఏపికి అన్యాయం చేస్తున్న మోదిని జగన్‌ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. కేసుల కోసమే మోదికి జగన్‌ అమ్ముడుపోయారని ఆరోపించారు. సీఎం కాక ముందు వైఎస్‌ఆర్‌కు కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి అని, వైఎస్‌ సీఎం అయ్యాక వందల కోట్లు ఎలా వచ్చాయని కేఈ ప్రశ్నించారు.