సివిల్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల

SMTV Desk 2017-07-28 17:32:29   serCivil Prelims results released services 2017, october, main

న్యూఢిల్లీ, జూలై 28 : వచ్చే అక్టోబర్ 28న సివిల్ సర్వీసెస్-2017 సివిల్స్ మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. గత నెల 18న జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. అర్హత పొందిన అభ్యర్థులంతా సివిల్స్ మెయిన్ పరీక్ష (2017) కోసం ఆన్‌లైన్‌లో సవివరమైన దరఖాస్తు ఫామ్ (డీఏఎఫ్) నింపాల్సి ఉంటుందని యూపీఎస్సీ తెలిపింది. వచ్చేనెల 17 నుండి 31 సాయంత్రం ఆరు గంటల వరకు యూపీఎస్సీ వెబ్‌సైట్ www.upsc.gov.in లో అభ్యర్థులకు ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది.