'బిగ్ బాస్ 3' హోస్టింగ్ పై స్పందించిన వెంకటేశ్..

SMTV Desk 2019-01-11 16:09:27  Venkatesh, Varun tej, F2 Movie, Big boss3 , host

హైదరాబాద్, జనవరి 11: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఎఫ్ 2 సినిమా రేపు భారీస్థాయిలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వెంకటేశ్ బిజీగా వున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. బిగ్ బాస్ 3 షోకి తాను హోస్ట్ గా వ్యవహరించనున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని గురించి ప్రస్తావించారు. బిగ్ బాస్ 3 షోకి తాను హోస్ట్ గా చేయనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఇదంతా కేవలం రూమర్ మాత్రమే అని స్పష్టం చేశారు.

కాగా బిగ్ బాస్ 3 నిర్వాహకులు వెంకటేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్త తరువాతనే మెగా స్టార్ చిరంజీవి పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై చిరంజీవి ఏమంటారో .. బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరించేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.