కోడికత్తి కేసు నిందితుడికి రిమాండ్

SMTV Desk 2019-01-11 15:52:49  Jagan mohan reddy, Kodikatti, Srinivasrao, NIA, Court, Remand, Petition

విజయవాడ, జనవరి 11: వైఎస్ జగన్ కోడికత్తి దాడి కేసు ప్రధాన నిందితిడు శ్రీనివాసరావును ఈ రోజు ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చారు. కాగా ఈనెల 25వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. విజయవాడ సబ్‌ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు శ్రీనివాస్‌కు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఐఏ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ పిటిషన్‌పై నిందితుడి తరపు లాయర్‌ కౌంటర్‌ దాఖలు చేయక పోవడంతో ఎన్‌ఐఏ పిటిషన్‌ను కోర్టు పెండింగ్‌లో పెట్టింది.