బలహీన బృందం..??? ఏపీ

SMTV Desk 2019-01-11 13:35:33  AP CM, TDP, Janmabhoomi maa ooru, Teleconference

అమరావతి, జనవరి 11: జన్మభూమి-మా ఊరు చివరిరోజుపై శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ళల్లో ఏపిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. ‘యావత్‌ ప్రపంచమే మన వైపు చూస్తుందని మనది బలహీన బృందమని చిన్నచూపు చూశారు.

ఏ బృందాన్ని చిన్న చూపు చూసారో ఆ బృందంతోనే అద్భుతాలు సృష్టించాం. అంతేకాక 670అవార్డులు సాధించాం అని బాబు అన్నారు. అధికార, ఉద్యోగ బృందాన్ని చూసి గర్విస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఏపీఆర్టీజీని టోనీ బ్లెయిర్, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్ అభినందించారన్నారు. సింగపూర్‌లో లేని వ్యవస్థకు ఏపి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.