30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో చూపాడు...!!!

SMTV Desk 2019-01-11 13:27:44  AP CM, Krish jagarlamudi, Balakrishna, NTR Kathanayakudu

అమారావతి, జనవరి 11: ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర దర్శకుడు క్రిష్ జాగార్లమూడిని అలాగే నందమూరి బాలకృష్ణ గారిని ఈ రోజు ఉదయం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ పాత్రను అద్భుతంగా నటించారని బాలకృష్టను ప్రశంసించారు. అంతేకాక ఎన్టీఆర్ జీవితాన్ని, త్యాగాన్ని, కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చారంటూ దర్శకుడు క్రిష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.
అంతేకాక చంద్రబాబు తన అధికార ట్విట్టర్ ఖాతాలో కూడా దీని పై ప్రసశించారు.