తెలంగాణలో దోస్తీ...ఏపీలో పోటీ

SMTV Desk 2019-01-11 13:12:54  Andhrapradesh Assembly elections, TDP, Congress party, Chandrababu, Rahul gandhi

అమరావతి, జనవరి 11: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెదీపా, కాంగ్రెస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం వీరి పొత్తు లేనట్టుగా కనిపిస్తుంది. దీనిపై రాహుల్‌, చంద్రబాబు తమ పార్టీలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు పలు వర్గాలు చెప్తున్నారు. ఏపిలో విడిగా పోటీ చేసినా దేశ ప్రయోజనాల కోసం కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా కలిసి నడవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేకున్నా ఏపి ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బిజెపియేతర కూటమికి అన్ని పార్టీలు మద్దతు పలకాలని చంద్రబాబు కోరుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.

కాగా రాహల్‌ కూడా ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌ వ్యతిరేక విధానాల నుంచి పుట్టిన పార్టీ అయినందున రాష్ట్రంలో టిడిపి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే టిడిపికి ఇబ్బంది అవుతుందేమోనన్నది పార్టీ వర్గాల ఆలోచన. రాష్ట్రాల్లో పొత్తులకు పోయి నష్టపోవడం కన్నా జాతీయస్థాయిలో ఐక్యంగా ఉండడం సబబు అనే నిర్ణయానికే రాహుల్‌, చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తుంది.