‘పేట’ ఫస్ట్ డే కలెక్షన్స్..

SMTV Desk 2019-01-11 12:55:05  Rajinikanth, Petta, first day collections

హైదరాబాద్, జనవరి 11: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా తొలి షోతోనే మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. రజనీ తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు ఓవర్ సీస్ లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అమెరికాలో అయితే ఏకంగా 220 లొకేషన్స్‌లో విడుదల అయింది.

తాజా సమాచారం ప్రకారం ‘పేట ప్రీమియర్ షోల ద్వారా తెలుగు, తమిళ భాషల్లో 5,45,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.3.84 కోట్లు వసూలు చేసిందంటున్నారు. ఈ కలెక్షన్లు గతంలో రజనీకాంత్ నటించిన ‘కబాలి , ‘2.ఓ చిత్రాల ఓపెనింగ్స్‌తో పోలిస్తే చాలా తక్కువని సమాచారం.