తెలంగాణ సీఎం కోసం కొత్త వాహనాలు....

SMTV Desk 2019-01-11 12:47:27  CM KCR, Telangana State, New vehicles for KCR, Intelligence

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఇంటలిజెన్స్ అధికారులు హై ఎండ్ కార్లను కొనాలని నిర్ణయించారు. ఇదివరకు 2014 లో కేసీఆర్ కాన్వాయ్ లో టయోటా ల్యాండ్ క్రూజర్, ప్రడోస్, టయోటా ఫార్చునర్ కార్లను కొనుగోలు చేశారు. అయితే సీఎం కోసం ఇంటలిజెన్స్ అధికారులు మెర్సిడెస్ బెంజ్ తోపాటు వివిధ కార్లను పరిశీలించి చివరకు టయోటా వాహనాలను సీఎం కాన్వాయ్ కోసం కొనాలని నిర్ణయించారు. సిఎం కోసం ప్రడోస్ కారును ఎంపిక చేశారు.

సిఎం కెసిఆర్‌ హైదరాబాద్ నగరంతోపాటటు గజ్వేల్ లోని తన వ్యవసాయ క్షేత్రానికి తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో సీఎం కాన్వాయ్ లో ఏడు నుంచి పది కొత్త కార్లను కొనాలని నిర్ణయించారు. ప్రడో కారు ధర రూ.93 లక్షలు, ఫార్చునర్ కారు రూ.33 లక్షలుంది. కొత్త కార్లను కొన్నాక వాటిని మైన్ ప్రూఫింగ్ చేయించనున్నారు. సిఎం కోసం కొత్తగా మెర్సిడెస్ కారును కొనాలని తెలంగాణ పోలీసు అధికారులు భావించినాకెసిఆర్‌ దానిపై ఆసక్తి చూపించలేదని సమాచారం.