నేడు మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు...

SMTV Desk 2019-01-11 11:22:59  Hyderabad traffic rules, Santh sreegurugovind singh Birthday, Additional CP Anil kumar

హైదరాబాద్, జనవరి 11: శుక్రవారం సిక్కుల గురువు సంత్ శ్రీగురుగోవింద్ సింగ్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మహా నగరంలో నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ జన్మదినం సందర్భంగా నేడు సిక్కులు పెద్ద సంఖ్యలో గౌలిగూడలోని గురుద్వారా సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీని పురస్కరించుకొని గౌలిగూడలోని గురుద్వారా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ గురుద్వారా పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. సెంట్రల్‌ గురుద్వారా సాహెబ్‌ నుంచి అశోక్‌బజార్‌, గురునానక్‌ మార్గ్‌, అఫ్జల్‌గంజ్‌ జంక్షన్‌, సిద్ధి అంబర్‌బజార్‌, మొహింజాహిమార్కెట్‌, జాంబాగ్‌, పుత్లీబౌలీ మీదుగా సాగే ఈ యాత్రలో సుమారు 2000లకు పైగా సిక్కులు పాల్గొనే అవకాశముంది.