సీనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలపై పవన్ కామెంట్స్

SMTV Desk 2019-01-10 20:09:42  Pawan kalyan, Senior NTR, TDP, Janasena

అమారావతి, జనవరి 10: తెలుగుదేశం పార్టీ అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పై జనసేన అధినేత పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వొకానొక సందర్భంలో అన్న వ్యాఖ్యలకు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ విధంగా తన పార్టీ అధికార ట్విట్టర్ వేదికగా స్పందించారు.



‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

పవన్ జిల్లాల్లో నిర్వహించిన పోరాట యాత్రలు, కవాతు సందర్భంగా పవన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్న విషయాన్ని ఈ ట్వీట్ లో జనసేన ప్రస్తావించింది.ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తోందో చూడాలి.