10 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు..

SMTV Desk 2019-01-10 19:41:49  Ebc 10 percent reservations, Reservation Bill, Supreme cort, pill file

న్యూఢిల్లీ, జనవరి 10: అగ్రవర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల బిల్లుపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ యూత్ ఫర్ ఈక్విటీ సంస్థ ఈ పిల్ ను దాఖలు చేసింది. ఈ బిల్లు ద్వారా భారత దేశంలోని రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే, అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్లో మంగళవారం లోక్ సభ, నిన్న రాజ్యసభ ఆమోదం తెలిపాయి. ఈబీసీ రిజర్వేషన్ వల్ల బ్రాహ్మణులు, వైశ్య, క్షత్రియ, రాజ్ పుత్ లు, జాట్స్, మరాఠాలు, భూమిహార్, కమ్మ, కాపు, రెడ్డి వంటి సామాజిక వర్గాల పేద ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.