తల్లి పాత్రలో పవన్ మాజీ భార్య..

SMTV Desk 2019-01-10 19:30:35  Pavan kalyan, renu desay, Mother role, new movie

హైదరాబాద్, జనవరి 10: టాలీవుడ్ లో తల్లి పాత్రల కోసం ఈమధ్య సీనియర్ హీరోయిన్స్ ను రంగంలోకి దించుతున్నారు. ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాలలో ఈ తరహా పద్ధతి కనిపిస్తుంది. ఫలితంగా నదియా .. ఖుష్బూ .. తులసి .. ప్రగతి .. శరణ్య వంటివారు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో .. తన సినిమాలో తల్లి పాత్రను చేయమని ఇటీవల వొక నిర్మాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని అడిగాడట.

తన సినిమాలో తల్లి పాత్రను ఆమె చేయడం వలన క్రేజ్ మరింత పెరుగుతుందని అన్నాడట. కాగా, అందుకు రేణు దేశాయ్ పెద్దగా ఆసక్తిని చూపలేదని సమాచారం. తన ఆరోగ్యం బాగుండలేదనీ, అందువలన చేయలేనని చెప్పినట్టుగా సమాచారం. తల్లి పాత్రను చేయమని రేణు దేశాయ్ ని అడిగిన నిర్మాత, ఆమెకి బాగా పరిచయమున్నవాడేనట. అందువలన రేణు దేశాయ్ చెప్పింది నిజమే అయ్యుంటుందనే చెప్పుకుంటున్నారు. మొత్తానికి రేణు దేశాయ్ తో రీ ఎంట్రీ ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయన్న మాట.