యుద్ద భూమిగా మారిన 'జన్మభూమి-మా ఊరు' సభ....

SMTV Desk 2019-01-10 18:21:00  TDP, Janmabhoomi maa ooru, YSRCP, Krishna, Uyyooru

కృష్ణా, జనవరి 10: జిల్లాలోని ఉయ్యూరులో గురువారం ఉదయం జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమ సభ కాస్త యుద్ద భూమిగా మారింది. ఈ సభలో తెదేపా, వైసీపీ పార్టీల కార్యకర్తల మధ్య పెద్ద తోపులాట జరగడంతో అక్కడి వాతావరణం అంతా వేడెక్కిపోయింది. రెండు పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. పూర్తి వివారాల ప్రకారం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో ఈ రోజు ఉదయం జరిగిన జన్మభూమి సభలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగింది. వొకానొక దశలో ఉద్రిక్తత నెలకొంది.

అయితే ఈ సభలో వైసీపీ నేత రామచంద్రరావు డ్వాక్రా రుణాల మాఫీ గురించి ప్రశ్నించారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు రామచంద్రరావుకు మధ్య మాటల యుద్దం చోటు చేసుకొంది. అదే సమయంలో జన్మభూమి సభ వద్దకు వచ్చిన మాజీ మంత్రి పార్ధసారధి కూడ టీడీపీ నేతలను నిలదీశారు. ఈ సమయంలోనే రెండు పార్టీల మధ్య వాగ్వావాదం, తోపులాట చోటు చేసుకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జన్మభూమి సభ నుండి వైసీపీ నేతలను పోలీసులు పంపించివేశారు.