అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన 36 ఏళ్ల మహిళ..ఎలా వెళ్లిందో తెలుసా?

SMTV Desk 2019-01-10 17:56:55  sabarimala, Ayyappa, Women entry in Sabarimala Temple, kerala woman

తిరువనంతపురం, జనవరి 10: సుప్రీం కోర్టు వయసుతో సంబంధం లేకుండా మహిళలందరిని శబరిమల అయ్యప్ప ఆలయంలోనికి అనుమతించాలంటూ తీర్పునిచ్చిన నేపథ్యంలో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నేలకొన్నాయి. ఇప్పటికే ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారని కేరళ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నేలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన మంజు అనే 36 ఏళ్ల మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించానని తెలిపారు. తలకు తెల్లరంగు వేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకున్నానితెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మంజు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. దాంతోపాటు ఎలా తాను అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లిందనే వివరాలను కూడా షేర్‌ చేసింది.

ఆమె చెప్పిన వివరాల ప్రకారం ‘త్రిస్సూర్‌ నుంచి జనవరి 8న నా శబరిమల యాత్ర ప్రారంభించాను. అయితే ఆందోళనకారుల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో తలకు తెల్లరంగు వేసుకున్నాను. దాంతో నేను పెద్దవయసు స్త్రీలా కనిపించాను. ఈ ప్రయత్నం నాకు మంచే చేసింది. నన్ను చూసిన ఆందోళనకారులు పెద్దవయసు స్త్రీగా భావించి.. ఆలయంలోకి వెళ్లేందుకు అడ్డు చెప్పలేదు. దాంతో పోలీసుల సాయం లేకుండానే నేను అయ్యప్పను దర్శించుకున్నాను. ఆలయంలోకి ప్రవేశించిన నేను దాదాపు 2 గంటలపాటు సన్నిధానంలో గడిపానం టూ చెప్పుకొచ్చారు మంజు.



నా ఆలయప్రవేశానికి అఖిల భారత అయ్యప్ప సంఘం సభ్యులు చాలా సాయం చేశారన్నారు మంజు. అయితే గత ఏడాది అక్టోబరులోనే తాను అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యానని చెప్పారు మంజు. కానీ ఈ సారి మాత్రం దర్శనం చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు.