ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్తితిలో లేరు : ఏపీ మంత్రి

SMTV Desk 2019-01-10 17:11:56  AP Minister, Devineni uma maheshwararao, YSRCP, YS Jagan mohan reddy, Narendra modi

విజయవాడ, జనవరి 10: ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్‌ ఇక నుండి కాశీయాత్ర చేసుకుంటే మంచిదని ఆయన అన్నారు. కాశీలో మీకు మోడి కూడా తోడవుతారు. ప్రజలు మీ అబద్ధాలు నమ్మే పరిస్థితిలో లేరుగ అని అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై జగన్‌ మాట్లాడారా? అని ప్రశ్నించారు. జగన్‌, కేసీఆర్‌, మోదీ కుమ్మక్కయ్యారని మంత్రి విమర్శించారు. రాయలసీమలో పరిశ్రమలు వస్తుంటే వొక్క మాటైనా జగన్‌ మాట్లాడారా అని నిలదీశారు.