కాజల్ కన్నా అనుష్క తక్కువట..

SMTV Desk 2019-01-10 17:06:51  anushka shetty, kajal agarwal, nayanatara, remunerations

హైదరాబాద్, జనవరి 10: అనుష్క అగ్రకథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో కొనసాగుతోంది. కాగా, కొద్దీ రోజులుగా అనుష్క చాలా తక్కువ సినిమాలు చేస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో అనుష్క అందరికంటే ఎక్కువ పారితోషకం తీసుకుంటుంది అని అనుకున్నారు. కానీ అనుష్క చాలా తక్కువ పారితోషికమే తీసుకుంటోందనే టాక్ బయటికి వచ్చింది. తాజాగా హేమంత్ మధుకర్ తో చేయనున్న సినిమాకిగాను ఆమె 1.25 కోట్లను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే, కాజల్ వొక సినిమాకి 2 కోట్లు తీసుకుంటూ ఉండగా, అంతకంటే అనుష్క తక్కువ తీసుకోవడం ఆశ్చర్యకరం.

అనుష్క మొదటి నుంచి కూడా కథాకథనాలకే ప్రాధాన్యత ఇస్తుందనీ, పారితోషికాన్ని ఎప్పుడూ డిమాండ్ చేయదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే అందరికంటే ఎక్కువ పారితోషకం నయనతార తీసుకుంటుంది. ఆమె తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది. నయనతార వొక సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకూ తీసుకుంటుందట.