ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం..!!!

SMTV Desk 2019-01-10 16:44:37  AP MP, TDP, Atchennayudu, YSRCP, Janmabhumi-maa vuuru

శ్రీకాకుళం, జనవరి 10: ఇచ్చాపురంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి వెళ్తున్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రికి తెదేపా కార్యకర్తలు స్వాగతం పలుకుతుండగా హఠాత్తుగా వైసీపీకి చెందిన ఓ స్వాగత ద్వారం కుప్పకూలింది. దీంతో పలువురు కార్యకర్తలు గాయాలు పాలయ్యారు.

జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా ఇచ్ఛాపురంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. మంత్రి అచ్చెన్నాయుడికి స్వాగతం పలికేందుకు భారీగా వెళ్తున్న కార్యకర్తలపై జగన్ ప్రజా సంకల్ప యాత్ర కోసం ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం వొక్కసారిగా కూలిపోయింది. దీంతో నలుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.