ప్రజాస్వామ్యాన్ని కించపరిచిన నితీష్: తేజస్వీ యాదవ్

SMTV Desk 2017-07-28 16:23:14  bihar cm nithishkumar, deputy cm thejaswiyadav people , assembly ,

పట్నా,జూలై 28 : ప్రజల నిర్ణయాన్ని అగౌరవపరిచిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ అన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసి, అసెంబ్లీ ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించిన నితీష్ పై తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల నిర్ణయాన్ని ముఖ్యమంత్రే గౌరవించకపోవడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని అన్నారు. ఈ మేరకు నితీష్ ప్రజలకు తూట్లు పొడిచారని వ్యాఖ్యానించారు. సీఎం నితీశ్‌కు రానున్న రోజుల్లో బిహార్ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.