సహకార సంఘాల ఎన్నిక మరింత ఆలస్యం...

SMTV Desk 2019-01-10 15:24:49  PACS Elections, Postponed, C Pardhasaradhi, State government

హైదరాబాద్, జనవరి 10: రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు మరోసారి ఆలస్యం కానున్నాయి. ఈ ఎన్నికలు నిలిపివేయాలంటూ రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ ఎటువంటి నోటిఫికేషన్‌ను ఇవ్వరాదని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి పార్ధసారధి సహకార శాఖ అధికారులను ఆదేశించారు. పంచాయితీ పోల్స్‌తో పాటే కొంచెం అటు ఇటుగా సహకార ఎన్నికలు కూడా జరుగుతాయనుకున్నా ఇప్పట్లో నిర్వహించకూడదనే నిర్ణయానిన ప్రభుతవం వచ్చింది.

అయితే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం సహకార సంఘాలకు ఎన్నికలను నిర్వహించే అవకాశాలుకనిపిస్తున్నాయి.దీంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతాయనున్న సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో ఉండే పరిస్థితి లేకుండా పోయింది. పంచాయితీ ఎన్నికలు ముగియగానే ప్రాథమిక వ్యవసయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలని ముం దుగా భావించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్‌రావు కూడా కూడా ఆ దిశగా సహ కార శాఖ అధికారులకు సంకేతాలు ఇచ్చారు.