ఎన్టీఆర్ 'కథానాయకుడు' తొలిరోజు కలెక్షన్స్..

SMTV Desk 2019-01-10 15:15:55  NTR Biopic, kadhanayakudu, Balakrishna, Krish, first day collections

హైదరాబాద్, జనవరి 10: నిన్న బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని తొలి భాగం కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైంది. కాగా, ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 7.61కోట్లన షేర్ ను వసూలు చేసింది. పండుగ సెలవులు మొదలు కానుండటంతో, ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చిత్రం పూర్తిగా భిన్నమైన కథ కావడం వలన పోటీ ప్రభావం పెద్దగా ఉండదని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ నటించిన జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలోని 63 గెటప్స్ లో బాలకృష్ణ కనిపిస్తుండం ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా ఇదే స్థాయిలో దూకుడు చూపుతుండటం విశేషం.