తిరుపతికి పయనమైన జగన్...

SMTV Desk 2019-01-10 12:02:44  YS Jagan mohan reddy at Tirupati, Renigunta railway station, Prajasankalpa yatra

తిరుపతి, జనవరి 10: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన తన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం ఇచ్చాపురంలో ముగిసిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు తిరుపతికి కాలి నడకన వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ రోజు ఉదయం తిరుపతికి పయనమయ్యారు జగన్. విజయనగరం నుంచి రైల్లో బయల్దేరి ఈ రోజు ఉదయం రేనిగుంటకు చేరుకోనున్నారు. తర్వాత రోడ్డు మార్గాన 11 గంటలకల్లా తిరుపతి పద్మావతీ అతిధి గృహం చేరి కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని అనంతరం మధ్యాహ్నం వొంటిగంటకు బయల్దేరి కాలినడకన తిరుమలకు బయల్దేరుతారు.



సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో కొండపైకి చేరుకుని పద్మావతీ అతిధి గృహం చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం శ్రీవారి దర్శనానికి వెళతారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం వేకువ జామున 6 గంటలకు తిరుమల నుంచీ బయల్దేరి కడప జిల్లా వెళతారు.విశ్వసనీయ సమాచారం మేరకు జగన్‌ గురువారం సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకోనున్నారు.కాలినడక భక్తులు వెళ్లే దివ్య దర్శనం క్యూలైన్‌ ద్వారా స్వామి వారి దర్శనానికి వెళతారు. అనంతరం శారదా మఠానికి వెళ్ళి బస చేస్తారు.