తమిళ 'అర్జున్ రెడ్డి' ట్రైలర్ ..

SMTV Desk 2019-01-09 19:48:12  Varma, new movie, Druv, Vikram, Surya, vijay devarakonda, arjun reddy tamil version

జనవరి 9: యువ నటుడు విజయ్ దేవరకొండ కధానాయకుడిగా తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తుండగా, తమిళంలో ' వర్మ ' పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ లో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా చేస్తున్నాడు. బాలా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ను హీరో సూర్య చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఈ ట్రైలర్ లో సేమ్ విజయ్ దేవరకొండ లుక్ లోనే ధృవ్ కూడా కనిపిస్తున్నాడు. హీరో లైఫ్ లోని వివిధ కోణాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రొమాన్స్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళంలోను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనీ, ధృవ్ కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని విక్రమ్ భావిస్తున్నాడు.