'ఎన్టీఆర్ మహానాయకుడు' కోసం ఎదురుచూపు ??​

SMTV Desk 2019-01-09 17:38:28  NTR Biopic, Balakrishna, Krish, kalyan ram, Nandamuri Suhasini

హైదరాబాద్, జనవరి 9: యువరత్న బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు చూశారు. అనంతరం నందమూరి సుహాసిని మీడియాతో మాట్లాడుతూ.. మా తాతయ్య ఎన్టీఆర్ గురించి తెలియని వాస్తవాలను ‘కథానాయకుడు ద్వారా తెలుసుకున్నానని అన్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా తాతయ్య గురించి తెలియని వాస్తవాలను చాలా తెలుసుకున్నాను. ఈ సినిమా బాగా చిత్రీకరించారు. నాన్నగారి పాత్రలో కల్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో నటీనటులందరూ బాగా చేశారు. క్రిష్ గారి డైరెక్షన్ చాలా అద్భుతం ఉందన్నారు. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి ఈ చిత్ర విజయానికి తోడ్పడాలని, ఈ చిత్రం రెండో భాగం కోసం ఎదురుచూస్తునన్నారు. రేపు రిలీజ్ అయినా థియేటర్ కు వెళ్లిపోతాం అంటూ ఆసక్తిని కనబరిచారు.