'ఎన్టీఆర్' బయోపిక్ పై లక్ష్మీపార్వతి స్పందన..

SMTV Desk 2019-01-09 16:53:05  NTR Biopic, Balakrishna, Lakshmi parvathi, Reaction

హైదరాబాద్, జనవరి 9: యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యన్.టి.ఆర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు తొలి భాగంగా కథానాయకుడు అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కావడంతో, థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. తాజాగా ఈ సినిమా గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... "ఎన్టీఆర్ బయోపిక్ ను చూడమని నన్నెవరూ ఆహ్వానించలేదు. సీఎం చంద్రబాబు కనుసన్నలలోనే ఈ బయోపిక్ రూపొందింది. అందువలన ఎన్టీఆర్ కి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెరకెక్కే అవకాశం లేదు.

ఈ సందర్బంగా ప్రేక్షకులలోనూ, నిజమైన అభిమానుల్లోను ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తి లేదు. అందరు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కోసమే వేచి చూస్తున్నారన్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను రూపొందించే ధైర్యం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే వుంది. అసలు నిజాలు అందులోనే ఉంటాయి" అని ఆమె అన్నారు