రజనీ, మురుగదాస్ ల సినిమా టైటిల్ ఖరారు..

SMTV Desk 2019-01-09 15:27:32  Rajinikanth, Petta, Sankranthi Realese, new movie, narkali

చెన్నై, జనవరి 9: సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చేయడంలో ఆయన యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. కబాలి, కాలా, 2.ఓ, సినిమాలను వరుసగా థియేటర్లకు తీసుకొచ్చిన ఆయన, రేపు 'పేట' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

కాగా రజనీకాంత్ తదుపరి సినిమాను మురుగదాస్ తో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తిచేసిన మురుగదాస్, ఈ చిత్రానికి 'నర్కాలి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట. తమిళంలో 'నర్కాలి' అంటే కుర్చీ అని అర్థం. దీంతో రజనీతో మురుగదాస్ రూపొందించే సినిమా కూడా పొలిటికల్ డ్రామానే అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక ఇదే టైటిల్ ఖరారు కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.