ఆంధ్ర యూనివర్సిటీ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్

SMTV Desk 2019-01-09 15:14:26  Narasimhan, Telugu states governer, Narashimhan attend andhra university celebrations, Director of delhi IIT Acharya ram gopal rao, Andhra university VC Nageshwara rao

విశాఖపట్నం, జనవరి 9: ఆంధ్ర యూనివర్సిటీ కట్టమంచి రామలింగారెడ్డి హాల్ లో 85, 86వ స్నాతకోత్సవ వేడుకల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తో పాటు మంత్రి గంటా, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే చీఫ్ గెస్ట్ గా ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ఆచార్య రాంగోపాల్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామగోపాల్‌కు గవర్నర్ నరసింహన్ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. అలాగే 546 మందికి డాక్టరేట్‌లు, ఆరుగురికి డిగ్రీలను ప్రదానం చేశారు. 573 మంది విద్యార్థులకు పతకాలను గవర్నర్ నరసింహన్ బహూకరించారు.