నేడు ముగియనున్న జగన్ ప్రజాసంకల్ప యాత్ర

SMTV Desk 2019-01-09 13:55:10  YS Jagan mohan reddy completed pada yatra, YSRCP President

అమరావతి, జనవరి 9: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజసంకల్ప యాత్ర నేటితో ముగియనుంది. ఇడుపులపాయలో 2017 నవంబరు 6న ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. మొత్తం 341 రోజుల్లో ఆయన సుమారు 3,648 కిలోమీటర్లు నడిచారు.

అన్న వస్తున్నాడు.. మంచి రోజులొస్తున్నాయిగ అంటూ మొత్తం 13 జిల్లాల మీదుగా జగన్‌ పాదయాత్ర కొనసాగించారు. నగర, పట్టణ, గ్రామీణ, కొన్ని మారుమూల ప్రాంతాల్లోనూ ఆయన ప్రజలను కలుస్తూ వారి కష్ట, నష్టాలను తెలుసుకుంటూ వచ్చేది మన ప్రభుత్వం.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని భరోసానిస్తూ ముందుకు కదిలారు. పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతూనే అక్కడక్కడా బహిరంగ సభల్లో ప్రసంగించారు.