బాబు బాట -బంగారుబాట, జగన్‌ బాట- జైలుబాట : ఏపీ సీఎం

SMTV Desk 2019-01-09 13:48:47  AP CM Fires on ys jagn, Chandrabaabu teleconference with party leaders

అమరావతి, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు ఈ రోజు తమ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ అవినీతి చక్రవర్తి అని ఆయన వల్ల ఎంతమంది జైలుకు వెళ్లారో ప్రజలకు వివరించాలన్నారు.

అవినీతి పరులే అవినీతి అంటూ పుస్తకాల వేస్తున్నారని ఆయన విమర్శించారు. బాబు బాట -బంగారు బాట, జగన్‌ బాట- జైలు బాట అని ప్రజలక వివరించాలన్నారు. ఏపికి రావల్సిన నిధులపై జగన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు.