కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్ కన్నుమూత

SMTV Desk 2017-07-28 14:49:55  Former Chief Minister of Karnataka N Dharam Singh,Modi, Congress President Sonia Gandhi and Vice President Rahul Gandhis mourning

న్యూఢిల్లీ, జూలై 28 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎన్ ధరంసింగ్ (83) గురువారం గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రోజున హఠత్తు గా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య దవాఖానకు తరలించిన 40 నిమిషాలకు మృతి చెందారు. ఆయన 2004 నుంచి 2006 మధ్య కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పని చేసిన ఆయన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధరంసిగ్ మృతి పట్ల భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్ణాటక ప్రజల హృదయాల్లో ఆయన ప్రత్యే క స్థానం సంపాదించుకున్నారని సోనియా పేర్కొన్నారు.