ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి చెప్పిన చరణ్..

SMTV Desk 2019-01-09 13:05:11  SS Rajamouli, NTR, Ram Charan, RRR Movie

హైదరాబాద్, జనవరి 9: రామ్ చరణ్ .. కైరా అద్వాని జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ బిజీగా వున్నాడు. తాజా ఇంటార్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజమౌళితో చేస్తోన్న సినిమాను గురించి కూడా ప్రస్తావించాడు.

దర్శకుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాకి మమ్మల్ని ఎంపిక చేసుకున్న తరువాత కథను రాసుకోలేదు. కథ పూర్తయిన తరువాతనే మమ్మల్ని ఎంచుకున్నారు. కథను నాకు .. ఎన్టీఆర్ కి ఆయన విడివిడిగా చెప్పలేదు. ఇద్దరినీ వొకేచోట కూర్చోబెట్టి ఈ కథను వినిపించారు. కథ విన్న తరువాత ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి నాకు కాస్త సమయం పట్టింది. కానీ తారక్ ముందుగా రియాక్ట్ అయ్యాడు. అంతటి అద్భుతమైన కథను రాజమౌళి సిద్ధం చేశారు. ఈ సినిమాలో నేను సాదా సీదాగానే కనిపిస్తాను. తారక్ మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తాడు. కొంతకాలం క్రితం తారక్ .. నేను కాలిఫోర్నియా వెళ్లింది కూడా ఈ సినిమా పనిమీదనే" అంటూ చెప్పుకొచ్చాడు.