ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన 'ఎన్టీఆర్' చిత్ర బృందం..

SMTV Desk 2019-01-09 12:36:55  NTR Biopic, Balakrishna, Krish, kalyan ram

హైదరాబాద్, జనవరి 9: ఈరోజు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1100 థియేటర్లలో విడుదల కాగా, థియేటర్ల వద్ద నందమూరి అభిమానుల సందడి మిన్నంటుతోంది. చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ, కూకట్‌ పల్లిలోని భ్రమరాంబ థియటర్ లో అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఆయనతో పాటు హీరోయిన్ విద్యాబాలన్, కల్యాణ్ రామ్, డైరెక్టర్ క్రిష్ కూడా సినిమా చూసేందుకు వచ్చారు. పలువురు అభిమానులు బాలయ్య, కల్యాణ్ రామ్ లతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిని చూపారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మాట్లాడుతూ, ఓవర్ సీస్ నుంచి సినిమాకు మంచి టాక్ వచ్చిందని చెప్పారు.