జగన్ అక్రమాస్తుల దర్యాప్తులో మరికొన్ని ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

SMTV Desk 2017-07-28 14:33:15  Jagan, Nimmagadda prasad, Jagan CBI invetigation, ED attachment of jagan Assets

అమరావతి, జూలై 28: జగన్ అక్రమాస్తుల కేసులో మరో 149 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు సంబంధించిన ఈ ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. వాన్‌పిక్ వ్యవహారంపైన సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గతంలో ఇదే వ్యవహారంలో జగన్‌కు సంబంధించిన ఆస్తులతో పాటు ఆయన కంపెనీకి ఆస్తులను, నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబంధించిన సుమారు 500కోట్ల ఆస్తులను అటాచ్ చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో మరికొన్ని ఆస్తులను గుర్తించింది. అందులో భాగంగా మరో రూ.149 కోట్ల విలువైన భూములను ఈడీ ఈరోజు జప్తు చేసింది. సిబిఐ మొత్తం 11 చార్జ్షీట్లను దాఖలు చేయగా ఇప్పటివరకు ఈడీ 9 చార్జ్షీట్లకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది.