ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్..

SMTV Desk 2019-01-08 16:24:38  Rafale deal. Reliance, Rahul Gandhi, Nirmala Sitharaman, Narendra Modi, HAL

న్యూఢిల్లీ, జనవరి 8: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రఫేల్‌ వొప్పందంపై మరింత స్వరం పెంచారు. ఈ సోమవారం పార్లమెంట్‌ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లుగా రూ.లక్ష కోట్ల కాంట్రాక్టులో హెచ్‌ఏఎల్‌కు వొక్క ఆర్డర్‌ కానీ, వొక్క రూపాయి కానీ ప్రభుత్వం నుంచి రాలేదు. నిర్మలా సీతారామన్‌ రక్షణ మంత్రిగా కాదు, ప్రధాని మోదీకి అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు అని అన్నారు. మోదీ ప్రభుత్వం అనిల్‌ అంబానీకి లాభం చేకూర్చేందుకే ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను బలహీన పరుస్తోందని ఆరోపించారు.

కాగా, ఎంతో అనుభవం ఉన్న ప్రతిభావంతులైన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఉన్న హెచ్‌ఏఎల్‌కు రూ.15,700 కోట్లను చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేసింది. ఆ సంస్థను ఆర్థికంగా దెబ్బకొట్టిన విషయంలో సమాధానం చెప్పేందుకు చౌకీదార్‌ (ప్రధాని మోదీ) సభలో ఉండరు. సభకు రావడానికి ఆయన భయపడుతున్నారు అని రాహుల్‌ ఎద్దేవా చేశారు.