'ఎందుకు' పాట టీజర్ ను విడుదల చేసిన వర్మ..

SMTV Desk 2019-01-08 15:18:23  Ram Gopal Varma, Lakshmi's NTR, Enduku Song

హైదరాబాద్, జనవరి 8: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం, వ్యక్తిగత జీవితం, అందులో లక్ష్మీ పార్వతి పాత్రను ప్రధానంగా ఇందులో చూపుతామని వర్మ గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాలో ‘ఎందుకు అనే రెండో పాటను ఈరోజు సాయంత్రం గం.5 లకు రిలీజ్ చేయనున్నారు. తాజాగా ‘ఎందుకు పాట టీజర్ ను వర్మ విడుదల చేశారు.

‘జయసుధ, జయప్రద, శ్రీదేవి... వీరందరిని కాదని ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు? అంటూ సాగే పాట టీజర్ ను వర్మ ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్ లో వర్మ ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్దలుగా చలామణి అవుతున్న నిజాలని .. నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలని బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ముఖ్య ధ్యేయం అన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పూర్తి పాటను విడుదల చేస్తామని ప్రకటించారు.