వైసీపీకి షాక్....

SMTV Desk 2019-01-08 12:02:33  Adiseshigiri rao ghattamaneni, YSRCP, YS Jagan

అమరావతి, జనవరి 8: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత ఆదిశేషగిరి రావు ఘట్టమనేని తన పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రతో ఎంతో ఊపు మీదున్న ప్రతిపక్ష వైసీపీ కి ఇది ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. అయితే, ఆయన పార్టీ నుంచి వైదొలగాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దాంతో పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

కాగా రాజకీయాల్లో కొనసాగుతాను అని చెప్పిన ఆదిశేషగిరి ఏ పార్టీలో చేరుతానని మాత్రం చెప్పలేదు. రేపటితో వైఎస్ జగన్ ప్రజసంకల్ప యాత్ర ముగుస్తున్న తరుణంలో కీలక నేత ఆదిశేసి రాజీనామా ప్రకటన చేయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తుంది. ఆదిశేషగిరి రావు తెలుగు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు. ఆదిశేషగిరి రావు గతంలో కాంగ్రెసులో పనిచేశారు.