పండక్కి బాగానే నవ్వించేలా ఉన్నారు.....ఎఫ్2 ట్రైలర్

SMTV Desk 2019-01-07 20:03:10  Venkatesh, Varun tej, Tamannah, Mehreen, F2 Movie, Trailer

హైదరాబాద్, జనవరి 7: విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సినిమా నిర్మితమైంది. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కథానాయికలుగా అలరించనున్నారు. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.