బీహార్ సీఎం విశ్వాస పరీక్షలో విజయం

SMTV Desk 2017-07-28 13:28:59  cm nithishkumar assembly meeting winner mlas

పాట్నా, జూలై 28 : బీహర్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ నేడు అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు. విశ్వాస పరీక్షలో దాదాపు ఆయనకు అనుకూలంగా 131 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇక వ్యతిరేకంగా 108 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. తీవ్ర గందరగోళ మధ్య సభలో ఓటింగ్ జరిగింది. సభ బయట ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆందోళనకు వ్యక్తపరుస్తున్నారు. నితీష్ తీరుపై విరుచుకు పడ్డ తేజస్వి యాదవ్ తన బుద్ధి బయట పెట్టుకున్నారని ఈ విషయంపై కొన్ని నెలలుగా డ్రామా జరుగుతుందని తేజస్వి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నితీష్ సంకీర్ణ ధర్మాన్ని ఉల్లంఘించడంతో పాటు, మోసం చేశారని ధ్వజమెత్తారు.