రాష్ట్రంలో మొదటిసారిగా రూ.600 కోట్లతో కంపెనీ

SMTV Desk 2017-07-28 13:02:15  AP CM, chandrababu naidu, Chief minister, TDP, PI data center, IT Park amaravathi

అమరావతి, జూలై 28: మంగళగిరి ఐటీ పార్కులో "పై డేటా సెంటర్‌"ను ప్రారంభించారు ఏపీ సిఎం. అయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా రూ. 600 కోట్లతో ఏర్పాటుచేసిన డేటా సెంటర్, ఈ కంపెనీ వలన ప్రత్యక్షంగా 300 మందికి, 2వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగంలో మన రాష్ట్రం ముందుంది. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు అన్ని కంపెనీలలో ఉన్నారు. అంతకుముందు బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ మాత్రమే దేశంలో ఉండేవి. తర్వాత చాలా సెల్‌ఫోన్ కంపెనీలు వచ్చాయి. అదే విధంగా ఏపీలో కూడా మరిన్ని సంస్థలు రాబోతున్నాయి. అమరావతి అభివృద్ది ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయోమెట్రిక్, ఈ-కెబినెట్ లాంటి సాంకేతికతను ఉపయోగించుకుంటుంది రానున్న రోజుల్లో మరిన్ని కొత్త సాంకేతికతలను ఉపయోగించబోతున్నాం అని ఆయన స్పష్టంచేశారు.