రిపబ్లిక్ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే....కేంద్రం పై బాబు ఫైర్

SMTV Desk 2019-01-07 13:50:16  New delhi republic celebrations, AP, Chandrababu

అమరావతి, జనవరి 7: న్యూ ఢిల్లీ లో గణతంత్ర దినోత్సవ వేడుకలుకు ఏపీ కూడా తన శకటం ప్రదర్షించేదుకు అవకాశం కోల్పోయింది. అయితే దీనిపై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివారాల ప్రకారం త్వరలో దేశ రాజధానిలో రిపబ్లిక్ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో ప్రతి రాష్ట్రానికి చెందిన శకటాన్ని ఊరేగిస్తారు. ఈ సంవత్సరం మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ థీమ్ తో శకటం ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే ఈ థీమ్ తో ఏపీ తయారు చేసిన శకటం కేంద్రాన్ని మెప్పించలేకపోయింది. కాగా ఈ విషయంపై చంద్రబాబు స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు ఇది వొక పరాకాష్ఠ అంటూ ధ్వజమెత్తారు. శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై లేఖ రాయాలని కేంద్రం వివక్షతను బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

ఏపీ అన్ని రంగాల్లో ముందజలో ఉందని అందుకే తమ రాష్ట్రంపై మోదీ అసూయ పెంచుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ పేరు వినపడితేనే ఆయనకు అక్కసు పెరిగిపోతోందని, రాష్ట్ర పురోగతి చూసి భరించలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా శకటం ప్రదర్షించేదుకు తెలంగాణ రాష్ట్రము కూడా అవకాశాన్ని కోల్పోయింది. తెలంగాణ అధికారులు తయారు చేసిన శకటం ఈ సారి కూడా ఢిల్లీలో అధికారులను మెప్పించలేకపోయింది. ఇలా ఈ అవకాశాన్ని కోల్పోవడం తెలంగాణకు వరుసగా నాలుగో సారి.