చిరు అల్లుడి జోడీగా రియా..

SMTV Desk 2019-01-07 11:57:21  Chiranjeevi, kalyan dev, new movie, Riya Chakravarthi, pulivasu

హైదరాబాద్, జనవరి 7: మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ఇటీవల విజేత సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో ఆ సినిమా విజయం సాధించకపోయిన, నటన పరంగా, లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న ఆయన, పులివాసు దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించిన, చివరికి రియా చక్రవర్తి ని ఖరారు చేసుకున్నారు. హిందీలో బ్యాంక్ చోర్ , జలేబి , హాఫ్ గర్ల్ ఫ్రెండ్ .. సినిమాలతో ఆమె యూత్ కి బాగా చేరువైంది. తెలుగులో తూనీగ తూనీగ చేసిన ఆమెకి నిరాశే మిగిలింది. మళ్లీ ఇప్పుడు కల్యాణ్ దేవ్ జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ .. పోసాని కృష్ణమురళి కీలకమైన పాత్రలను పోషించనున్నారు.