తొలి మంత్రి వర్గ సమావేశం : కేసీఆర్, మహమూద్ ఆలీ

SMTV Desk 2019-01-07 11:50:31  KCR, Mohammed ali, Telangana Home minister

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ ఆలీ తానూ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదటి సారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. వీరిద్దరూ నేడు నగరంలోని ప్రగతి భవన్ లో సమావేశానికి సిద్దమయ్యారు. కాగా మొహమద్ అలీ ప్రమాణం స్వీకారం చేసినప్పటినుండి ముఖ్యమంత్రి ని కలవడం ఇదే మొదటి సారి కనుక ఈ సమావేశం తొలి మంత్రి వర్గ సమావేశం అవుతుంది.

ఈ సమావేశంలో వివిద శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొని ఎన్నికల హామీలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. పాలనాపరమైన అంశాలపై కూడా నేడు వారు అధికారులతో చర్చించవచ్చు అనే వార్తలొస్తున్నాయి. కాగా నేటి సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం కోసం ఆర్డినెన్స్ జారీ చేసే అవకశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 17 నుంచి 20 వరకు శాసనసభ సమావేశాలు జరుగబోతున్నాయి కనుక వాటిలో చర్చించవలసిన ముఖ్యాంశాలపై కూడా నేటి సమావేశంలో చర్చించవచ్చు.